మార్చి 31న మహావీర్ జయంతోత్సవాలు

మార్చి  31న మహావీర్ జయంతోత్సవాలు

బషీర్​బాగ్, వెలుగు: శ్రీ మహావీర్ జైన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఈనెల 31న భగవాన్ మహావీర్ 2,625వ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో వారు మాట్లాడుతూ.. 31న ఉదయం 9 గంటలకు తాడ్​బండ్ హనుమాన్ దేవాలయం నుంచి సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ వరకు మహావీరుని రథయాత్ర (వర్గోద), అనంతరం ఆధ్యాత్మిక ధర్మసభ జరుగుతాయని, భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.