మావోయిస్టుల ప్రలోభాలకు లోను కావద్దు : సంగ్రామ్​ సింగ్​ జీ పాటిల్

మావోయిస్టుల ప్రలోభాలకు లోను కావద్దు : సంగ్రామ్​ సింగ్​ జీ పాటిల్
  •     మహబూబాబాద్​ ఎస్పీ సంగ్రామ్​ సింగ్​జీ పాటిల్

కొత్తగూడ, వెలుగు : మావోయిస్టుల ప్రలోభాలకు లోనుకాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మహబూబాబాద్​ ఎస్పీ సంగ్రామ్​ సింగ్​ జీ పాటిల్​ సూచించారు. మావోయిస్టు ప్రభావిత కొత్తగూడ, గంగారం మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్​ స్టేషన్లను మంగళవారం తనిఖీ చేశారు. ఈనెల 30న జరుగుతున్న ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేయాలన్నారు. అంతకు ముందు కొత్తగూడ, గంగారం పోలీస్​ స్టేషన్​లను తనిఖీ చేసి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ సత్యనారాయణ, సీఐ ఫణిధర్, ఎస్​ఐలు నగేశ్, దీలీప్​ ఉన్నారు. 

 దివ్యాంగులు, వృద్ధులు ఓటుహక్కు తప్పక వినియోగించుకోవాలి

ములుగు, వెలుగు : దివ్యాంగులు, వయోవృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకొని యువతకు ఆదర్శంగా నిలవాలని ఎన్నికల అధికారిణి, కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో అసెంబ్లీ ఎన్నికలు, స్వీప్​ కార్యక్రమంలో భాగంగా వృద్ధులు, దివ్యాంగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 80ఏళ్ల పైబడిన వృద్ధుల కోసం ఎన్నికల కమిషన్​ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే వీలును కల్పించిందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకొని బాధ్యతను ఇతరులకు వివరించాలన్నారు. ప్రత్యేక ఏర్పాట్లు కూడా పోలింగ్​ కేంద్రాల వద్ద చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూవో ప్రేమలత, డీపీవో వెంకయ్య, సీడీపీవో స్వాతి తదితరులు పాల్గొన్నారు. 

ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు తావివ్వొద్దు

ములుగు, వెలుగు : ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావివ్వొద్దని, శాంతియుత వాతావరణంలో నామినేషన్​ వేసి శాంతిభద్రతలకు సహకరించాలని ఎస్పీ గౌష్​ ఆలం సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం పోలీసు అధికారులతో భ్రదతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులు నామినేషన్​ వేసేందుకు బందోబస్తు చర్యలు చేపడుతున్నామని, దానికి అనుగుణంగా సంబంధిత అధికారుల సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ అశోక్​ కుమార్​, ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్​, అడిషనల్​ ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్​, ఎస్బీ ఇన్​స్పెక్టర్​ కిరణ్​, సీఐలు రంజిత్ కుమార్, శంకర్​, ఎస్సైలు అప్పాని వెంకటేశ్వర్​, చల్ల రాజు, బి.ఓంకార్​ యాదవ్​, షేక్​ మస్తాన్​, కృష్ణప్రసాద్​, రవి, తదితరులు పాల్గొన్నారు.