Mahesh Babu: రాకాశి అల‌లు ఎగ‌సిప‌డే చోట‌, మహేష్ ఆట.. అద్భుతమైన బస అంటూ సూపర్ స్టార్ పోస్ట్

Mahesh Babu: రాకాశి అల‌లు ఎగ‌సిప‌డే చోట‌, మహేష్ ఆట.. అద్భుతమైన బస అంటూ సూపర్ స్టార్ పోస్ట్

రాజమౌళి-మహేష్ బాబు SSMB29 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో వీరిద్దరూ తమ శక్తిని, ఉనికిని ఖండాంతరాలకు చాటి చెప్పబోతున్నారు. ఇందుకోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా సాధ్యపడని సాహసాలన్నీ చేస్తున్నారు. సినిమా షూటింగ్కే ముందే జక్కన్న పలు దేశాల అడవులని రెక్కీ చేయగా.. ఇప్పుడు మహేష్ని కూడా రంగంలోకి దించాడు.

ప్రస్తుతం జక్కన్న-మహేష్ అండ్ SSMB29 టీం: ప్ర‌పంచ దేశాల్లోని ద‌ట్ట‌మైన అడ‌వులు, కొండ‌లు గుట్ట‌లు, వాగులు వంక‌లు, సముద్రాలు దాటుకుని సాహసం చేస్తున్నారు. భారీ ఫారెస్ట్ అడ్వెంచరస్‌‌ మూవీని చూపిస్తూనే, భారతీయ పురాణ అంశాలను, ఆధునిక గ్లోబ్ ట్రాటింగ్ తో అంత‌ర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే రిస్కీ ప్లేసెస్ లలో షూటింగ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే నిదర్శనంగా ఎన్నో లీక్ వీడియోస్ చూస్తూ వస్తున్నాం. లేటెస్ట్గా మహేష్ బాబు పోస్ట్ చేసిన ఓ ఫోటోతో మరోసారి ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. 

ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ అండ్ మైథికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ మూవీలో మహేష్.. ప్ర‌పంచ సాహ‌స‌యాత్రికుడిగా కనిపిస్తున్నారు. అంటే తాను ఎంచుకున్న లక్ష్యసాధనలో..‘ఎదురయ్యే దట్టమైన అడవులనే కాదు, ఉప్పొంగే సముద్ర కెరటాలను కూడా దాటే లక్ష్యసాధకుడిగా’ మహేష్ కనిపిస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు మహేష్ పోస్ట్ చేసిన పోస్ట్ కూడా అదే అర్ధం తీసుకువస్తుంది. 

‘‘ అఖండమైన ఆనందం! అద్భుతమైన బసకు జోయాలికి ధన్యవాదాలు..’’ అని టైడ్ ఈమోజీని మహేష్ షేర్ చేసాడు. స‌ముద్ర‌పు రాకాశి అల‌లు నిత్యం విరుచుకుప‌డే చోట మహేష్ కోసం బ‌స ఏర్పాటు చేసారన్నమాట. అందుకే మ‌హేష్ తనలోని ఎగిసిపడే ఎగ్జ‌యిట్ మెంట్ ను చూపిస్తున్నాడు. అయితే, మహేష్ మాల్దీవుల పర్యటన సందర్భంగా ఈ ఫోటో షేర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమా షూట్లో భాగంగా అక్కడ కొన్నిరోజులు బస చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 

అలాగే, SSMB29 కోసం మహేష్.. ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ స్టోన్ లైట్ హౌస్కి వెళ్లనున్నట్లు కూడా టాక్ ఉంది. అంటే.. ఇక్కడి సముద్రం యందు నిర్మించిన లైట్ హౌస్ని రాకాశి అల‌లు నాలుగు సార్లు మింగేస్తే, నాలుగు సార్లు ఇంగ్లండ్ ప్ర‌భుత్వం వంద‌ల కోట్లు ఖర్చు పెట్టి పున‌ర్మించిందట. అంతేకాదు ఇక్కడి ప్రదేశంలో దెయ్యాలు కూడా సంతరిస్తాయట. ఇపుడు అలాంటి చోటుకే మహేష్ని జక్కన్న తీసుకెళ్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మహేష్ చేసే సాహసాలపై నెటిజన్లు, ఆయన ఫ్యాన్స్ 'శభాష్ సూపర్ స్టార్.. అసలైన తుఫాను కోసం ఎదురుచూస్తున్నాం' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

SSMB29 ఇండియాలో రెండు షెడ్యూల్స్‌‌, కెన్యాలో ఓ షెడ్యూల్‌‌ను పూర్తి చేశారు. అయితే ఈ సినిమా నుంచి అఫీషియల్‌‌ అప్‌‌డేట్‌‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు నవంబర్‌‌‌‌లో ఫస్ట్ లుక్‌‌ను రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవల రాజమౌళి ప్రకటించారు. నవంబర్ 16న ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఫస్ట్ లుక్ మాత్రమే కాకుండా టైటిల్ గ్లింప్స్‌‌ కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం హాలీవుడ్ స్థాయిలో ఓ గ్రాండ్ ఈవెంట్‌‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.