ప్రియాంక ఫైట్స్ కు మహేష్‌‌‌‌ ఫిదా

ప్రియాంక ఫైట్స్ కు  మహేష్‌‌‌‌ ఫిదా

గ్లోబల్ స్టార్‌‌‌‌‌‌‌‌గా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌‌‌‌తో దూసుకెళుతోంది ప్రియాంక చోప్రా.  ఆమె లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటించిన ‘ది బ్లఫ్‌‌‌‌’ చిత్రంపై మహేష్ బాబు ప్రశంసల జల్లు కురిపించారు.  ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసిన నేపథ్యంలో శనివారం సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు.  ‘ట్రైలర్‌‌‌‌‌‌‌‌ చాలా నచ్చింది.  ప్రియాంక మరోసారి రాజీ  పడని, అత్యద్భుత నటనతో మెప్పించారు. టీమ్ అందరికీ  బెస్ట్ విషెస్‌‌‌‌’ అని మహేష్‌‌‌‌ ట్వీట్ చేశారు. 

ఫ్రాంక్‌‌‌‌ ఇ. ప్లవర్స్ డైరెక్ట్ చేసిన ఈ స్వాష్‌‌‌‌బక్లర్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ను రూసో బ్రదర్స్ నిర్మించారు.  ఇందులో ఎర్సెల్ బోడెన్ అనే ఒక మాజీ సముద్రపు దొంగగా ప్రియాంక నటించింది. తన కూతురును కాపాడుకునేందుకు ఎంతకైనా తెగించే తల్లిగా మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌లో ఆమె నటన ఆకట్టుకుంది. అలాగే యాక్షన్‌‌‌‌ సీన్స్‌‌‌‌తో అబ్బురపరిచింది ప్రియాంక.  కార్ల్‌‌‌‌ అర్బన్‌‌‌‌, ఇస్మాయిల్‌‌‌‌ క్రజ్‌‌‌‌ కోర్డోవా, సఫియా ఓక్లే-గ్రీన్‌‌‌‌, టెమురా మోరిసన్‌‌‌‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.  ఫిబ్రవరి 25 నుంచి ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంలో మహేష్‌‌‌‌ బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్నారు.