మహేష్ బాబు చెంపపై శ్రీలీల ముద్దు..అదిరిపోయిన సెకండ్ సింగిల్ పోస్టర్

మహేష్ బాబు చెంపపై శ్రీలీల ముద్దు..అదిరిపోయిన సెకండ్ సింగిల్ పోస్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్(Trivikram) డైరెక్షన్ లో వస్తోన్న మూవీ గుంటూరు కారం (Gunturkaram). చాలా రోజుల నుంచి ఫస్ట్ సింగిల్ కోసం ఎదురు చూసిన మహేష్ ఫ్యాన్స్ కు..దమ్ మసాలా సాంగ్ తో రుచి చూపించారు తివిక్రమ్. ఎదురొచ్చే గాలి..ఎగరేస్తోన్న చొక్కాపై గుండీ..ఎగబడి ముందడికే..వెళ్లిపోతాది నేన్నిక్కిన బండి..దమ్ మసాలా..అంటూ సాగే ఈ పాటకు తమన్ (Thaman S) అందించిన మ్యూజిక్..ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంది.

లేటెస్ట్గా గుంటూరు కారం సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఓ మై బేబీ (OhMyBaby) సాంగ్ ప్రోమోను డిసెంబర్ 11 సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. మహేష్ బాబు చెంపపై శ్రీలీల ముద్దు పెట్టుకున్నఈ క్రేజీ పోస్టర్ ఫ్యాన్స్కు మస్త్ హుషారిస్తోంది. కాగా ఈ పూర్తి సాంగ్ను డిసెంబర్ 13న రిలీజ్ చేయబోతున్నారు. ఇది రొమాంటిక్ లవ్ సాంగ్లా ఉండబోతుందని తెలుస్తుంది. 

చాలా కాలం తరువాత మహేష్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా ప్రతి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే ప్రోమోలు, పోస్టర్స్ కూడా ఉండటంతో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. 

హారిక హాసిని క్రియేషన్స్(Harika hasini creations) పై చినబాబు (Chinababu), సూర్యదేవర నాగవంశీ(Suryadevara nagavanshi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో..బ్యూటీ శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో సంక్రాంతి కానుక‌గా 12 జనవరి 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది. 

  • Beta
Beta feature