Murari Re Release Collections: రీ రిలీజ్ సినిమాల్లో మురారి రికార్డ్..బాక్సాఫీస్‌ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!

Murari Re Release Collections: రీ రిలీజ్ సినిమాల్లో మురారి రికార్డ్..బాక్సాఫీస్‌ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!

సూపర్ స్థార్ మహేశ్‌బాబు (Mahesh Babu)  సినీ కెరీర్‌లో క్లాసిక్‌ మూవీగా నిలిచిన మూవీ ‘మురారి’(Murari).విభిన్న చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.శుక్రవారం (ఆగస్టు 9) మహేశ్‌బాబు పుట్టినరోజు (49) సందర్భంగా ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేయగా క్రేజీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ రీ రిలీజ్ సినిమాల్లో ట్రేండింగ్ దిశగా దూసుకెళ్తోంది. 

తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం..మురారి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రీ రిలీజ్ సినిమాల్లో టాప్ త్రీలో ఒక‌టిగా నిలిచింది. అయితే, ఈ రీ రిలీజ్ సినిమాకు థియేటర్స్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడంతో బాక్సాఫీస్ కలెక్షన్స్ మోత పుట్టిస్తున్నాయి. కాగా ఫస్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ  రూ.5.50cr (ఐదున్న‌ర కోట్ల‌కు)పైగానే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు సమాచారం.

కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో మురారి మూవీకి ఏపీ, నైజాంలో క‌లిసి రూ. 2.26 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఒక్క హైద‌రాబాద్‌లోనే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మురారి రూ. 1.60 కోటి ల‌క్ష‌ల వ‌ర‌కు ద‌క్కించుకున్న‌ట్లు ట్రేడ్ వర్గాల నుండి స‌మాచారం.

అంతేకాదు శనివారం (ఆగస్టు 10) కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. దాదాపు రూ.20 లక్షల పైనే ఉన్నాయట. దీన్ని బట్టి చూస్తే..ఈ వీకెండ్ లో మురారి రీ రిలీజ్ సినిమాలలో రికార్డ్స్ క్రియేట్ చేయనుంది. ప్రస్తుతం టాప్ 1 లో పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా రీ రిలీజ్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఖుషి మూవీ రూ.7.76 కోట్ల‌తో టాప్ ప్లేస్‌లో ఉండగా..మహేష్ బాబు బిజినెస్‌మెన్ రూ.5 కోట్ల తొంభై ల‌క్ష‌ల‌తో సెకండ్ ప్లేస్‌లో ఉంది.

కాగా టాప్ 3 లో ఉన్న మురారి ప్రస్తుత వీకెండ్ దెబ్బతో టాప్ 1 చేరే అవకాశం కనిపిస్తుంది. ఏమవుతుందో చూడాలి. దాదాపు ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన మురారి మూవీ..ప్రస్తుతం రీ రిలీజ్ సందర్బంగా ఫస్ట్ డేకీ రూ.5.50cr (ఐదున్న‌ర కోట్ల‌కు)పైగానే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టడం విశేషం.