SSMB29: నవంబర్ 15న రాజమౌళి 'గ్లోబ్‌ట్రాటర్' రికార్డ్ లాంచ్: 130 అడుగుల స్క్రీన్‌పై టీజర్!

SSMB29: నవంబర్ 15న రాజమౌళి 'గ్లోబ్‌ట్రాటర్' రికార్డ్ లాంచ్: 130 అడుగుల స్క్రీన్‌పై టీజర్!

దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ' SSMB29' ( గ్లోబ్ ట్రాటర్ ) . 'RRR' సృష్టించిన సునామీ తర్వాత తెరకెక్కిస్తున్న ఈ మూవీని  భారతీయ సినీ చరిత్రలో మరో రికార్డును నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు జక్కన్న.  నవంబర్ 15, 2025న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'ది గ్రాండ్ గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్' పేరుతో ఈ చిత్రం బిగ్ రివీల్ జరగనుంది. ఈ వేడుక కేవలం ఒక సినిమా ప్రకటన మాత్రమే కాదు, భారతీయ సినిమా చరిత్రలో భూమిపైనే అతిపెద్ద సినీ ఈవెంట్‌గా నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 అంచనాలకు మించిన ఏర్పాట్లు..

ఈ 'గ్లోబ్‌ట్రాటర్' ఈవెంట్‌కు 50,000 మందికి పైగా అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని ప్రపంచానికి అందించేందుకు, భారతదేశంలోనే అతిపెద్దదైన 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తు గల భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ తెరపైనే సినిమా టీజర్ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ప్రదర్శితమవుతుంది. ఈ భారీ సెటప్ ద్వారా రాజమౌళి విజన్, చిత్ర ప్రపంచాన్ని దృశ్యమానం చేయనున్నారు. ఇది కేవలం సాంస్కృతిక ఘట్టం కాదు, అంతకుమించినదిగా ఉండబోతుందని చిత్రం బృందం తెలిపింది. 

మహేష్ బాబు డ్రమాటిక్ ఎంట్రీ..

ఈ ఈవెంట్ లో చిత్ర టైటిల్ ట్రాక్‌ను నటి, సింగర్ శ్రుతి హాసన్ , ప్రముఖ ర్యాపర్ డివైన్ కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఇది ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలవనుంది . వారి ప్రదర్శన తర్వాత, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు నిమిషాల నిడివి గల టీజర్ ప్రీమియర్ ఉంటుంది. ఈ టీజర్‌లో మహేష్ బాబు పాత్రను అద్భుతమైన మసాయి మారా (Masai Mara) నేపథ్యంతో చూపించడం హైలైట్ కానుంది. టీజర్ విడుదల సమయం వచ్చేసరికి, సూపర్ స్టార్ మహేష్ బాబు డ్రమాటిక్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ అద్భుత ప్రదర్శన ఆకాశంలో మెరిసే అద్భుతమైన బాణసంచా హైలెట్ గా నిలవబోతోంది. 

 గ్లోబల్ ప్రొమోషన్

ఈ చిత్ర బృందం కేవలం దేశీయంగానే కాక, అంతర్జాతీయంగా కూడా భారీ ప్రమోషన్స్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఆహ్వాన వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.  గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ..  "నేనెప్పుడూ హైదరాబాద్‌లోనే ఎందుకుంటున్నాననేది ప్రపంచంలోనే అతి తక్కువగా రహస్యంగా ఉంచబడిన విషయం. దానిని ఇప్పుడు మీకు చెప్పే సమయం వచ్చింది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే బిగ్ రివీల్‌లో మాతో చేరండి" అని అభిమానులకు ఆహ్వానం పలికింది. ప్రియాంకా హిందీలో చివరిసారిగా 'ది స్కై ఈజ్ పింక్' (2019)లో నటించిన తర్వాత, ఈ చిత్రంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తిరిగి వచ్చింది.


'కుంభ'గా పృథ్వీరాజ్ ఫస్ట్‌లుక్..

ఇటీవల చిత్ర బృందం విడుదల చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్‌లుక్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. 'కుంభ' పాత్రలో ఆయన పవర్ ఫుల్ లుక్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ లుక్‌తో నెలకొన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, నవంబర్ 15న రాబోయే ప్రకటన కోసం దేశం మొత్తం ఉద్విగ్నంగా ఎదురుచూస్తోంది.

 'వారణాసి' టైటిల్‌ పరిశీలన..?

రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచి, ఈ ప్రాజెక్ట్ చర్చనీయాంశమైంది. దీని టైటిల్‌పై అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ, 'వారణాసి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నాయి. ఈ భారీ వేడుకలో సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లేదా టీజర్ వంటి కీలకమైన అంశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ అపూర్వమైన ప్రకటన కోసం సినీ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

 జియోహాట్‌స్టార్‌లో  లైవ్ స్ట్రీమింగ్

ఈ బిగ్ రివీల్ జియోహాట్‌స్టార్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లైవ్ స్ట్రీమింగ్ కానుంది.  దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ చారిత్రక క్షణాన్ని రియల్ టైంలో చూడవచ్చు. సినిమా ఈ రోజు ప్రేక్షకులతో ఎలా కనెక్ట్ అవుతుందనే దానికి ఈ ఈవెంట్ చాలా ప్రత్యేకమైనది అని రాజమౌళి అన్నారు. "గ్లోబ్‌ట్రాటర్‌లో భాగం కావడం,  దాని మొదటి గ్లింప్స్‌ను జియోహాట్‌స్టార్‌లో లైవ్‌గా పంచుకోవడం నిజంగా ఉత్సాహంగా ఉందని  మహేష్ బాబు మాట్ తెలిపారు. ఇది సాంప్రదాయం, సాంకేతికతను అందంగా మిళితం చేసే ఒక చారిత్రక ఘట్టం అని తెలిపారు. SSMB29'గా కూడా పిలవబడే ఈ చిత్రం, గ్లోబల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినీ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం అని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.