రాజమౌళికి బాబు బర్త్ డే విషెస్.. SSMB29 అప్డేట్ ఏమైనా ఉంటుందా..? అన్నీ నవంబర్లోనేనా..?

రాజమౌళికి బాబు బర్త్ డే విషెస్.. SSMB29 అప్డేట్ ఏమైనా ఉంటుందా..? అన్నీ నవంబర్లోనేనా..?

‘‘సీరియల్ టూ టాలీవుడ్, టాలీవుడ్ టూ నేషనల్, నేషనల్ టూ ఇంటర్నేషనల్’’ ఇది మన దర్శకధీరుడి ఎస్.ఎస్.రాజమౌళి ప్రయాణం. అతన్ని ముద్దుగా మన తెలుగు ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ ప్రముఖులు ‘జక్కన్న’ అని పిలుస్తారు. అందుకు కారణం లేకపోలేదు.. ‘భారీ బడ్జెట్లు, అద్భుతమైన విజువల్స్, భావోద్వేగపూరిత కథాంశాలు’ వీటిని ఆయుధాలుగా చేసుకుని.. తాను తీసే సినిమాని ఓ శిల్పంలా చెక్కుతారు జక్కన్న. ఈ క్రమంలోనే ప్రేక్షకుల హృదయాల్లో సినిమాను పదిలంగా నిలబెడతారు. రాజమౌళి సృజనాత్మక గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే అవుతుంది.. ఈ మాట అనడానికి కూడా ఓ కారణముంది. రాజమౌళి శైలి, తన ఆలోచన విధానం వేరు కనుక. అందరీలా కామన్గా ఆలోచించడు. నిజం చెప్పాలంటే.. రాజమౌళి ఆలోచన ఎవ్వరికీ అంత త్వరగా అంతుచిక్కదు కూడా. తాను తీసిన చిత్రాలే అందుకు ఉదాహరణ.

మీరు గమనించి చూస్తే..(బాహుబలి 1,2లు RRR) లైఫ్‌స్టైల్ అడ్వెంచర్, ఇతిహాస కథనాలకు రాజమౌళి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అంశాలకు తోడు హ్యూమన్ ఎమోషన్స్ను కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపించడంలో ఎప్పుడూ ముందుంటారు. అలాంటి క్రియేటివ్ మైండ్ హంటర్ మన జక్కన్న. ఇవాళ ( 2025 అక్టోబర్ 10న) దర్శక నిర్మాత ఎస్ఎస్ రాజమౌళి 52 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా టాలీవుడ్ టూ ఇంటర్నేషనల్ సినీ స్టార్స్ జక్కన్నకు బర్త్ డే విషెష్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు X వేదికగా ఫోటో షేర్ చేస్తూ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘‘ఇండస్ట్రీలో ఉన్న ఒకేఒక్క దర్శకధీరుడు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు తెరకెక్కించేవన్నీ అద్భుతాలే. మీ నుంచి మరో అద్భుతం త్వరలోనే రానుంది’’ అని మహేష్ SSMB29 సెట్లో దిగిన ఫొటోతో విషెష్ అందించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం రాజమౌళి-మహేష్ SSMB29 మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. చరిత్ర, పురాణాల మిశ్రమంగా సినిమా ఉండబోతోంది. కాశీ చరిత్ర ఆధారంగా రాజమౌళి ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ భారీ అంచనాలు పెంచింది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి వారణాసి అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

అయితే, జక్కన్న బర్త్ డే స్పెషల్గా SSMB29 నుంచి అప్డేట్ ఆశిస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఒక పోస్టర్ తప్పితే, మిగతావన్నీ లీకుల ద్వారానే SSMB29 అప్డేట్స్ చూస్తూ వస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఏదైనా సాలిడ్ అప్డేట్ ఇస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు. మరి ఇవాళ అప్డేట్ ఏదైనా ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్గా మారింది. ఇకపోతే, జక్కన్న ముందుగా చెప్పినట్టుగా అన్నీ అప్డేట్స్ నవంబర్ లోనే ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది.