Varanasi Release Date: మహేష్ బాబు 'వారణాసి' రిలీజ్ డేట్ లాక్! గ్లింప్స్‌ను విడుదల చేసిన రాజమౌళి టీమ్!

Varanasi Release Date: మహేష్ బాబు 'వారణాసి' రిలీజ్ డేట్ లాక్! గ్లింప్స్‌ను విడుదల చేసిన రాజమౌళి టీమ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వారణాసి' (Varanasi). ఇప్పుడు ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే అభిమానులతో పాటు సినీ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. రెండు నెలల క్రితం హైదరాబాద్ , రామోజీఫిల్మ్ సిటీలో నిర్విహించిన భారీ ఈవెంట్ లో ఈ మూవీ టైటిల్ తో పాటు విడుదల సంవత్సరాన్ని కూడా ప్రకటించారు. 

గ్లింప్స్ రిలీజ్..

అయితే లేటెస్ట్ గా ఈ సినిమా విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్ ను మరోసారి రాజమౌళి టీమ్ అందించింది. సుమారు 26 సెకన్ల పాటు ఉన్న 'రామాయణం ఎపిసోడ్' తాలూకు  గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది. 2027లో 'వారణాసి' మూవీ తప్పక ప్రేక్షకుల ముందుకు వస్తుందని దాంట్లో మరో సందేహం లేదంటూ ఈ వీడియో ద్వారా స్పష్టం చేసింది.  ప్రస్తుతం ఇది  సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ చిన్న క్లిప్‌లో కనిపిస్తున్న విజువల్స్, హై-స్పీడ్ స్లో మోషన్ షాట్స్ రాజమౌళి మార్క్ మేకింగ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఈ వీడియోను చూసిన అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.

 కాలం దాటిన మహా అద్భుతం!

ఈ సినిమా కేవలం ఒక అడ్వెంచర్ మూవీ మాత్రమే కాదు, ఇందులో 'టైమ్ ట్రావెల్', 'పురాణ గాథల' మేళవింపు ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఇందులో 'రుద్ర' అనే శివ భక్తుడి పాత్రలో కనిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గూఢచారిలా సాగే ఈ ప్రయాణం.. చివరకు వారణాసి పుణ్యక్షేత్రం వద్ద ఒక భారీ మలుపు తిరుగుతుందని సమాచారం. ఇటీవల విడుదలైన ఫుటేజ్‌లో మహేష్ బాబు శ్రీరాముడి అవతారంలో కనిపించడం అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. త్రేతాయుగం నాటి లంకానగరం నేపథ్యంలో సాగే ఈ 'రామాయణం ఎపిసోడ్' కోసం రాజమౌళి ఏకంగా 60 రోజుల పాటు షూటింగ్ చేశారంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.

వారణాసి సెట్స్‌లో యుద్ధ వాతావరణం!

గత వారం రోజులుగా హైదరాబాద్‌లోని భారీ సెట్స్‌లో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఒక భీకరమైన ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో 1.43:1 రేషియోలో చిత్రీకరిస్తున్న తొలి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. ఎంఎం కీరవాణి సంగీతం, పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలవనున్నాయి.

►ALSO READ | OTT Thriller Review: పోలీస్ vs సీరియల్ కిల్లర్.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచేలా మమ్ముట్టి క్రైమ్ థ్రిల్లర్

నటీనటుల క్రేజీ లైనప్

పొడవాటి జుట్టు, గెడ్డంతో మునుపెన్నడూ చూడని విధంగా 'రుద్ర'గా సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించబోతున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, కండలు తిరిగిన దేహం రాజమౌళి శిక్షణలో మరో రేంజ్‌కు చేరాయి. ఇక ప్రియాంక చోప్రా  'మందాకిని' గా పవర్‌ఫుల్, మిస్టీరియస్ పాత్రలో నటిస్తున్నారు. 'కుంభ' అనే విలక్షణమైన ప్రతినాయకుడి పాత్రలో ఈ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. సైంటిఫిక్ మైండ్‌తో ఆలోచించే విలన్‌గా ఆయన పాత్ర హైలైట్‌గా ఉండనుంది.

2027 శ్రీరామనవమికి 'మహా జాతర'!

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9, 2027న శ్రీరామనవమి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 1,000 కోట్లకు పైగా బడ్జెట్‌తో కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ వండర్..  బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను సైతం తుడిచిపెట్టేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వారణాసి ఘాట్‌ల నుంచి ఆఫ్రికా అడవుల వరకు, అంటార్కిటికా మంచు కొండల నుంచి త్రేతాయుగం నాటి యుద్ధభూమి వరకు.. రాజమౌళి  ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. మరి ఈ గ్లోబల్ అడ్వెంచర్ ఇండియన్ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి!