
‘హీరో’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా రెండో ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్ వర్మ కథను అందించిన ఈ చిత్రానికి ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నాడు. లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తం షాట్‌కు వెంకటేష్ క్లాప్ కొట్టగా, నమ్రత శిరోద్కర్ కెమెరా స్విచాన్ చేశారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మిర్యాల రవీందర్ రెడ్డి, సాహు గారపాటి, హరీష్ పెద్ది మేకర్స్‌కి స్క్రిప్ట్‌ని అందజేశారు. ఆది శేషగిరిరావు, బివిఎస్ రవి, గల్లా జయదేవ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇదొక ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ అని, అశోక్ గల్లా నెక్స్ట్ లెవల్‌లో కనిపిస్తాడని చెప్పారు మేకర్స్.