తాతలు దిగొచ్చినా కొడంగల్లో సీఎంను ఓడించలేరు ..బీజేపీ చోరీలకు అలవాటు పడ్డది: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ 

తాతలు దిగొచ్చినా కొడంగల్లో సీఎంను ఓడించలేరు ..బీజేపీ చోరీలకు అలవాటు పడ్డది: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ 

నిజామాబాద్, వెలుగు: బీజేపీకి చోరీలు చేయడం అలవాటైపోయిందని పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్ విమర్శించారు. ప్రజల సొత్తు నుంచి ఓట్ల వరకు, రాజ్యసభ సీట్ల వరకు బీజేపీ చోరీలకు పాల్పడిందని ఆరోపించారు. ఓటు చోరీ లేకపోతే పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ అధికారంలోకి వచ్చేది కాదన్నారు. ఆదివారం నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నా హుందాగా ఉండాలని సూచించారు. బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చివరకు గాంధీయవాదిగా జీవిస్తున్న మీనాక్షినటరాజన్​ రాజ్యసభ సీట్​ను కూడా బీజేపీ చోరీ చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్‌‌‌‌‌‌‌‌ను కూడా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.

కొడంగల్‌‌‌‌‌‌‌‌లో రేవంత్ రెడ్డిని ఓడించడం బీజేపీ తాతలు, ముత్తాతలు దిగొచ్చినా సాధ్యం కాదని అన్నారు. పదేళ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో రాష్ట్రం వెనకబడిందని, కేటీఆర్ ఇప్పటికీ ఉద్యోగాల విషయంలో బూటకపు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచామని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి వస్తున్న విదేశీ పెట్టుబడులు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. అంతకుముందు నగర ఎమ్మెల్యే ధన్‌‌‌‌‌‌‌‌పాల్ సూర్యనారాయణతో కలిసి అగ్రసేన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రారంభించారు. కార్యక్రమంలో  మేయర్​ ఉమారాణి, అగ్రికల్చర్​ కమిషన్​ సభ్యుడు గడుగు గంగాధర్​, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు.