‘ది ప్యారడైజ్’ మూవీ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే బుకింగ్స్ మొదలై ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘ది ప్యారడైజ్’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా తీవ్రతకు తగ్గట్టుగానే సెన్సార్ బోర్డ్ ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. అంతేకాదు.. ఏకంగా 21 కట్స్, మార్పులు సూచించినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
సెన్సార్ వివరాల ప్రకారం.. సినిమాలోని సుమారు 25 సెకన్ల కంటెంట్‌ను పూర్తిగా తొలగించగా, మరో 1 నిమిషం 25 సెకన్ల సన్నివేశాలను రీప్లేస్ లేదా మోడిఫై చేసినట్లు సమాచారం. ముఖ్యంగా హింస, టార్చర్, రక్తపాతానికి సంబంధించిన కొన్ని విజువల్స్‌లో మార్పులు చేశారు. కొన్ని బూతు పదాలు, డైలాగ్స్‌ను మ్యూట్ చేయడం లేదా తొలగించడం జరిగిందట. అలాగే స్మోకింగ్, సిగరెట్ బ్రాండ్ రిఫరెన్స్‌లలోనూ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఇక సినిమాలోని పొలిటికల్ పేర్లు, రిఫరెన్సులు కూడా సెన్సార్ సూచనల మేరకు మార్చినట్లు సమాచారం. ఈ మార్పులన్నీ పూర్తయ్యాక ‘ది ప్యారడైజ్’ ఫైనల్ రన్‌టైమ్ 2 గంటల 54 నిమిషాల 4 సెకన్లుగా లాక్ అయింది. అంటే దాదాపు మూడు గంటల పాటు ప్రేక్షకులను ఒక ఇంటెన్స్ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాడన్నమాట.
#TheParadise : Censor Details
— IndiaGlitz Telugu™ (@igtelugu) September 21, 2026
- 21 Cuts/Modifications Listed
- 25 Seconds of content deleted
- 1 Min 25 secs of content replaced/modified
- Violence, torture & blood visuals modified
- Certain foul words/dialogues muted/deleted
- Smoking & cigarette brand refrences modified… pic.twitter.com/wWJ28m8UVD
నాని రియాక్షన్.. ‘ది ప్యారడైజ్’పై మరింత క్యూరియాసిటీ!
ఇప్పటికే సినిమా గురించి నాని చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తన కెరీర్‌లోనే డిఫరెంట్ అండ్ ఇంటెన్స్ మూవీగా ‘ది ప్యారడైజ్’ నిలుస్తుందనే నమ్మకాన్ని నాని వ్యక్తం చేస్తున్నాడు. సినిమాలోని పాత్ర, ప్రపంచం, కథనం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ALSO READ : పేరెంట్స్ ఇది గుర్తుపెట్టుకోండి.. ‘ది ప్యారడైజ్’ మూవీ పెద్దలకు మాత్రమే!
శ్రీకాంత్ ఓపెన్ టాక్.. అసలు కథ ఏంటి?
మరోవైపు సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న శ్రీకాంత్ కూడా ‘ది ప్యారడైజ్’ గురించి ఓపెన్‌గా మాట్లాడటం సినిమాపై హైప్‌ను పెంచుతోంది. కథలోని ఎమోషన్, పాత్రల మధ్య సంఘర్షణ, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన విధానం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సినిమా ఎలా ఉండబోతుందనే దానిపై మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి.
మోహన్ బాబు విలనిజం..
ఇక ఈ సినిమాలో మోహన్ బాబు విలనిజం మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. నాని పాత్రకు, మోహన్ బాబు పాత్రకు మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ సినిమాకు కీలక హైలైట్‌గా నిలవబోతుందనే టాక్ వినిపిస్తోంది. స్క్రీన్‌పై వీరిద్దరి ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సోనాల్ కులకర్ణి మదర్ సెంటిమెంట్..
మరోవైపు సోనాల్ కులకర్ణి పాత్ర కూడా సినిమాలో ఎమోషనల్ యాంగిల్‌ను తీసుకురానుందని సమాచారం. ముఖ్యంగా ఆమె పాత్రకు సంబంధించిన మదర్ సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించేలా ఉంటాయని టాక్. భారీ యాక్షన్, వైలెన్స్ మధ్య ఈ ఎమోషనల్ ట్రాక్ సినిమాకు మరో బలమైన లేయర్‌గా నిలవనుందని తెలుస్తోంది.
మొత్తానికి.. ‘A’ సర్టిఫికెట్, 21 కట్స్, దాదాపు 3 గంటల రన్‌టైమ్, భారీ వైలెన్స్, పవర్‌ఫుల్ విలనిజం, మదర్ సెంటిమెంట్, నాని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్.. ఇవన్నీ కలిపి ‘ది ప్యారడైజ్’పై అంచనాలను మరింత పెంచేశాయి. సెప్టెంబర్ 23 రాత్రి ప్రీమియర్స్‌తోనే ఈ హైప్‌కు అసలు రిజల్ట్ ఏంటో తేలనుంది. సెప్టెంబర్ 24న మాత్రం థియేటర్లలో నాని ‘ది ప్యారడైజ్’ మాస్ జాతర షురూ కానుంది!
