
- ఎమ్మెల్యేలు సబితారెడ్డి, ప్రకాశ్‌గౌడ్ ధీమా
గండిపేట, వెలుగు : చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని మరోసారి బీఆర్ఎస్కైవసం చేసుకోబోతుందని రాజేంద్రనగర్, మహేశ్వరం ఎమ్మెల్యేలు టి.ప్రకాశ్ గౌడ్, సబితాఇంద్రారెడ్డి చెప్పారు. బుధవారం నార్సింగిలో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ముదిరాజ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీలు సురభివాణీదేవి, ఎగ్గే మల్లేశంతో కలిసి ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలతో మమేకమై, జడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి సేవ చేశారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల గొంతుకగా జ్ఞానేశ్వర్ ను పార్లమెంట్‌కు పంపిద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఎంపీ రంజిత్‌రెడ్డి పార్టీని వదిలి వెళ్లిపోయారని, ఈ ప్రాంత ప్రజలకు రంజిత్‌రెడ్డిని పరిచయం చేసిందే కేసీఆర్అన్నారు. గతంలో కారు గుర్తుపై పోటీచేసి గెలిచిన వ్యక్తులే ఈసారి ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారని
ప్రజలు వారికి ఓటుతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే సమావేశం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ కవిత ఫొటో లేకపోవడం చర్చనీయాంశమైంది.