మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు

హైదరాబాద్, వెలుగు: మహిళల ఆర్థికాభివృద్ధే కాంగ్రెస్​ ప్రభుత్వ ధ్యేయమని మహిళా కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు పేర్కొన్నారు. సోమవారం మహిళా కాంగ్రెస్​ నేతలతో సునీతారావు నాంపల్లి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహాలక్ష్మి స్కీమ్​ ద్వారా మహిళలకు జరుగుతున్న మేలుపై ఆరాతీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలతో మాట్లాడారు.

 ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు 6 వేల కోట్లు మహిళల కోసం ఖర్చు పెడుతున్నదన్నారు. ఆటో కార్మికులు ఈ రోజు గుర్తుకొచ్చారా అని హరీశ్​రావును నిలదీశారు. పదేండ్లలో రేషన్ కార్డులు, ఉద్యోగాలు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తున్నారనే భయంతోనే బీఆర్​ఎస్​నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా రన్నారు.