మహీంద్రా ఎలక్ట్రిక్ కారు ధర రూ.16 లక్షల నుంచి

మహీంద్రా ఎలక్ట్రిక్ కారు ధర రూ.16 లక్షల నుంచి

మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఎలక్ట్రిక్ ఎస్‌‌‌‌‌‌‌‌యూవీ మోడల్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌యూవీ 400 ధరను ప్రకటించింది. రెండు వేరియంట్లలో ఐదు కలర్స్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉన్న ఈ వెహికల్ ధర రూ.15.99 లక్షల (ఎక్స్‌‌‌‌‌‌‌‌ షోరూమ్‌‌‌‌‌‌‌‌) నుంచి స్టార్టవుతోంది. ఎక్స్‌‌‌‌‌‌‌‌యూవీ 400 ఈఎల్‌‌‌‌‌‌‌‌ లో 39.4 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. 7.2 కిలోవాట్ ఛార్జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ వేరియంట్‌‌‌‌‌‌‌‌తో వస్తుంది.

ఫుల్ ఛార్జ్‌‌‌‌‌‌‌‌పై 456 కి.మీ వెళుతుందని మహీంద్రా వివరించింది. ఎక్స్‌‌‌‌‌‌‌‌యూవీ 400 ఈసీ వేరియంట్‌‌‌‌‌‌‌‌లో 34.5 కి.వాట్స్‌‌‌‌‌‌‌‌ బ్యాటరీని అమర్చారు. 3.3 కి.వాట్స్ ఛార్జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారు. 7.2 కి.వా ఛార్జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఎంచుకోవచ్చు. ఫుల్ ఛార్జ్‌‌‌‌‌‌‌‌పై 375 కి.మీ వెళుతుంది.