కుభీర్‏లోఎండుతున్న మొక్కజొన్న పంట

కుభీర్‏లోఎండుతున్న మొక్కజొన్న పంట


కుభీర్, వెలుగు: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంట చేతికి వచ్చే సమయానికి నిలువునా ఎండిపోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కుభీర్  మండలంలోని దార్ కుభీర్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన చాలా మంది రైతులు సిరి4456 మొక్కజొన్న రకం విత్తనాలను సాగు చేశారు.

విత్తనాలు మొలకెత్తినప్పటి నుంచి ఆశాజనకంగా ఉన్న పంట.. చేతికి వస్తుందన్న సమయానికి కండ్ల ముందే  ఎండి పోవడం చూసి రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఎకరాకు రూ.20 వేల వరకు ఖర్చు చేశామని.. ఇప్పుడు పెట్టుబడి కూడా వచ్చేలా కనిపించడం లేదని వాపోతున్నారు. నాసిరకం విత్తనాల వల్లే నష్టపోయామని మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు ఎండుతున్న పంటలను పరిశీలించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.