వరంగల్ :వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మక్కలకు రికార్డు ధర పలికింది. గతంలో ఎన్నడూ లేనంతగా ధర రావడంతో రైతులు ఆనందం అవధులేకుండా ఉంది. ప్రభుత్వం ఎం ఎస్ పీ ప్రకారం 2090 ఉండగా దానికి అదనంగా ప్రైవేటు ట్రేడర్స్ రూ.3016 క్వింటాకు కొనుగోలు చేయడంతో రైతులు రెట్టింపు సంతోషంలో ఉన్నారు.
హనుమకొండ జిల్లా నడి కూడా మండలం నర్సక్కపల్లి గ్రామానికి చెందిన సురావు కిషన్ రావు అనే రైతు తెచ్చిన మొక్కలకు ఈ రేటు పలికింది. ఈ స్థాయి ధర చరిత్రలో ఎన్నడూ లభించలేదని రైతులు చెబుతున్నారు.