ఘోర ప్రమాదం..రెండు లారీలు ఢీ.. డ్రైవర్ స్పాట్ లోనే మృతి

ఘోర ప్రమాదం..రెండు లారీలు ఢీ.. డ్రైవర్ స్పాట్ లోనే మృతి

హనమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొనడంతో ఓ డ్రైవర్ స్పాట్ డెడ్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో రెండు లారీలు ఢీకొనడంతో ఓ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్ పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటానా స్థలానికి చేరుకున్న పోలీసులు  స్థానికుల సహాయంతో గాయపడ్డవారిని హాస్పిటల్ కు తరలించారు. 

లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కొని పోవడంతో..స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుడు... సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మమఠంపల్లి మండలం బిల్యానాయక్ తండాకు చెందిన మోహన్ నాయక్ గా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని  పోలీసులు తెలిపారు.