ఘోర ప్రమాదం.. అదుపు తప్పి ఇంటిని ఢీ కొన్న లారీ

ఘోర ప్రమాదం.. అదుపు తప్పి ఇంటిని ఢీ కొన్న లారీ

రంగారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మైలార్ దేవ్ పల్లి లో లారీ బీభత్సం సృష్టించింది. మహిఫిల్ హోటల్ సమీపంలో ఓ వ్యాపార సముదాయంలోకి లారీ దూసుకెళ్లింది. వ్యాపార సముదాయం గోడ కూలి వాహనాల పై పడింది. గోడ కారు ఆటో మీద పడడంతో వాహనాలు ధ్వంసం అయ్యాయి. లారీ అధుపు తప్పి వస్తుండటంతో జనం భయంతో పరుగులు తీశారు. 

ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.  హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయం తో లారీని తొలగించే ప్రయత్నం చేశారు. మితిమీరిన వేగం నిర్లక్ష్యంగా లారీ నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.