తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. అల్యూమినియం ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు.. ఆరుగురికి గాయాలు

తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. అల్యూమినియం ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు.. ఆరుగురికి గాయాలు

తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏర్పేడు మండలం చింతలపాలెం టోల్ గేట్ సమీపంలో ఉన్న సీఎంఆర్ అల్యూమినియం ఫ్యాక్టరీలో శుక్రవారం (అక్టోబర్ 10) సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో కార్మికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. 

ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఫైరింజన్ల సహయంతో మంటలు ఆర్పేశారు. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో గాయపడ్డ కార్మికుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.