పుణె శానిటైజర్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో 15 మంది మృతి

పుణె శానిటైజర్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో 15 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పుణెలోని ఘోటావాడే ఫటాలోని శానిటైజర్‌ తయారు చేసే ఓ కెమికల్ ఇండస్ట్రీలో సోమవారం మధ్యాహ్నం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.  ఈ ఘటనలో ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది మహిళలున్నట్లు అధికారులు తెలిపారు. మరో 10 మంది జాడ కన్పించడం లేదు. వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు.

కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో మగవాళ్లు తప్పించుకోగా ..మహిళలు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది.. ఆరు అగ్నిమాపక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేస్తున్నారు.