‘మేజర్‌’కు యూపీ సీఎం యోగి అభినందనలు

‘మేజర్‌’కు యూపీ సీఎం యోగి అభినందనలు

డైరెక్టర్ శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్‌, సయీ మంజ్రేకర్‌ జంటగా నటించిన చిత్రం ‘మేజర్‌’. ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అంతేకాదు ఈ మూవీపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా ‘మేజర్’ సినిమాను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. మంగళవారం యోగి ఆదిత్యనాథ్‌ను ‘మేజర్’ చిత్ర బృందం కలిశారు. 

ఈ కార్యక్రమంలో మేజర్ హీరో అడివి శేష్‌, మేజర్ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ తల్లిదండ్రులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‘మేజర్‌’ టీమ్‌ను అభినందించి.. సన్మానించారు. అడివి శేష్‌తోపాటు సందీప్‌ తల్లిదండ్రులను శాలువాతో సత్కరించి, వెండి కాయిన్‌ ను సీఎం యోగి బహూకరించారు. ఈ విషయాన్ని హీరో అడివి శేష్‌ ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.