కేంద్రం నిర్ణయం: రైల్వేస్టేషన్ లలో టైట్ సెక్యురిటీ

కేంద్రం నిర్ణయం: రైల్వేస్టేషన్ లలో టైట్ సెక్యురిటీ

రైల్వే స్టేషన్ లలో సెక్యురిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇకపై విమానాశ్రయాలను తలపించే సెక్యురిటీ వ్వవస్థకు రంగం సిద్ధం చేసింది. ప్రధాన రైల్వే స్టేషన్లలోని అన్ని మార్గాలను మూసివేసి కేవలం ఒకే వైపు ఎంట్రీ గేట్ పెట్టనున్నారు. సెక్యురిటీ చెకింగ్ ను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండోలు పర్యవేక్షిస్తారు. దీంతో టికెట్లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఎవరు పడితే వారు స్టేషన్ లోకి వెళ్లకుండా.. అసాంఘీక శక్తులు స్టేషన్ లోకి ప్రవేశించకుండా ఈ చర్యలు ఉపయోగనడతాయని అంటున్నారు అధికారులు. ఇప్పటికే ప్రభుత్వం 114.18 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మొదట ముఖ్య మైన నగరాలలో భద్రత పెంచనున్నారు ఆతర్వాత మిగితా రైల్వేస్టేషన్ లలో భద్రత పెంచునున్నారు. ఫస్ట్ లిస్ట్ లో. హాబీగంజ్, గాంధీనగర్, ఢిల్లీ, ముంబై రైల్వే స్టేషన్లలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేయనున్నారు. ఇకపై 24గంటల పాటు కమాండోల పర్యవేక్షణలో రైల్వేస్టేషన్ లు ఉండనున్నాయి.