Kitchen Tip : పాలు విరిగాయని పారబోయొద్దు.. ఇలా స్వీట్ తయారు చేసుకోండి

Kitchen Tip : పాలు విరిగాయని పారబోయొద్దు.. ఇలా స్వీట్ తయారు చేసుకోండి

ఎంత జాగ్రత్తగా కాచినా కొన్నిసార్లు పాలు విరిగిపోతుంటాయి. ఆ విరిగిన పాలని పారబోయాలంటే మనసొప్పదు చాలామందికి. అలాంటప్పుడు వాటితో ఈ టేస్టీ అండ్ ఈజీ కోవా రెసిపీని ట్రై చేయొచ్చు.

కావాల్సినవి

  • విరిగిన పాలు - ఒక లీటరు
  • నిమ్మరసం - ఒక టీ స్పూన్
  • చక్కెర - ముప్పావు కప్పు 

తయారీ

విరిగిన పాలను వెడల్పాటి గిన్నెలో పోసి వేడిచేయాలి. పాలు విరిగినప్పటికీ అందులో కొద్దిగా పాల శాతం ఉంటుంది. అవి కూడా పూర్తిగా విరగడానికి నిమ్మరసం కలిపి అరనిమిషం మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి, మిశ్రమాన్ని వెడల్పాటి జాలీలోకి తీసుకోవాలి. నీళ్లన్నీ ఒడిసిపోయాక జాలీని నిమిషం పాటు నీళ్ల ట్యాప్ కింద పెట్టి, విరిగిన పాలని కడగాలి. దీనివల్ల నిమ్మరసం ఫ్లేవర్ అంతా పోతుంది. 

ALSO READ: Kitchen Tips : పూరీ పిండిలో బొంబాయి రవ్వ ఎందుకు కలపాలి 

పాల మిశ్రమం పూర్తిగా ఆరాక తిరిగి గిన్నెలో వేసి స్టవ్ వెలిగించాలి. అందులో టేస్ట్ కు  తగ్గట్టు చక్కెర వేసి బాగా కలపాలి. పాల మిశ్రమం గట్టిపడేవరకు బాగా కలుపుతూ ఉడికించి (దాదాపుగా ఆరు నిమిషాలు) స్టవ్ ఆపాలి. కొంచెం చల్లారాక పప్పు గుత్తితో మెదపాలి. ఆ తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోవా బిళ్లల్లా చుట్టాలి. వీటిని ఫ్రిజ్లో పెడితే వారం రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.