బస్సు యాత్రను  విజయవంతం చేయండి..   కాసాని పిలుపు

బస్సు యాత్రను  విజయవంతం చేయండి..   కాసాని పిలుపు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : టీడీపీ నిర్వహించనున్న బస్సు యాత్రలో అందరూ భాగస్వామ్యం కావాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌‌‌‌ కోరారు. సోమవారం ఆయన ఎన్టీఆర్‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌ భవన్‌‌‌‌లో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలన్నారు. అనుబంధ సంఘాలే పార్టీకి వెన్నుముక అన్నారు. అవి ఎంత ఎక్కువ పనిచేస్తే పార్టీ అంత బలోపేతం అవుతుందని తెలిపారు.

ప్రజా సమస్యలపై పోరాడి.. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అనుబంధ సంఘాలకు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.