
అనురూప్ కటారి హీరోగా నరేష్ పెంట దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ పై జయకృష్ణ దురుగడ్డ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ‘పడమటి కొండల్లో’ టైటిల్‌ను ఫైనల్ చేశారు. హీరో సాయి దుర్గ తేజ్ సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, బెస్ట్ విషెస్ చెప్పాడు.
చుట్టూ మంటలు అలుముకున్న పంట పొలాల మధ్య, రక్తం అంటిన కత్తితో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు అనురూప్. ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా అందిస్తున్న దర్శకుడు నరేష్ పెంట మాట్లాడుతూ ‘ప్రేమకథతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఓ విజువల్ ఫీస్ట్‌లా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’ అని చెప్పాడు.