దసరాకు వేట మొదలు

దసరాకు వేట మొదలు

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌లో జోష్‌‌‌‌‌‌‌‌ని నింపుతున్నారు రజినీకాంత్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఒకటి  ‘వేట్టైయాన్‌‌‌‌‌‌‌‌’.  టీజే జ్ఞానవేల్‌‌‌‌‌‌‌‌  దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.  ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌‌‌‌‌ చేశారు మేకర్స్. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నారు రజినీకాంత్. 

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవాలకు దగ్గరగా సోషల్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో చిత్రాలను రూపొందించే దర్శకుడు టీజే జ్ఞానవేల్‌‌‌‌‌‌‌‌ ఈ చిత్రాన్ని పోలీస్, న్యాయ వ్యవస్థల నేపథ్యంలో  తెరకెక్కిస్తున్నాడు.