సుడోకు గేమ్ సృష్టికర్త మాకి కాజి మృతి

V6 Velugu Posted on Aug 17, 2021

పాపులర్‌ పజిల్ గేమ్ సుడోకును సృష్టించిన మాకి కాజి (69) కన్నుమూశారు. బైల్ డక్ట్ క్యాన్సర్‌తో ఆయన చనిపోయారు. మాకి కాజిని గాడ్‌ఫాదర్ ఆఫ్ సుడోకోగా పిలుస్తారు. చిన్నపిల్లల కోసం నెంబర్స్‌తో పజిల్‌ను తయారు చేశారు. సుడోకో ఆటలో 1 నుంచి 9 మధ్య నెంబర్లను.. అడ్డం, నిలువుగా.. రిపీట్‌ కాకుండా ప్లేస్ చేస్తారు. 2004 ఇయర్ లో సుడోకో గేమ్ సూపర్‌హిట్ అయ్యింది. నిఖోలి కంపెనీకి కాజి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు.

టోక్యో మెట్రో ప్రాంతానికి చెందిన మిటాకా సిటీలో మాకి కాజి తుది ప్రాణాలు విడిచారు. తన పజిల్స్ గురించి ప్రచారం చేసేందుకు కాజి సుమారు 30 దేశాల్లో పర్యటించారు. 100 దేశాల్లో 20 కోట్ల మంది సుడోకు ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. కాజికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబసభ్యుల మధ్యే అంత్యక్రియలను పూర్తి చేశారు. 

Tagged dies, Maki Kaji, godfather of Sudoku

Latest Videos

Subscribe Now

More News