మాస్ కమర్షియల్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ చిత్రం మీటర్ టీజర్ విడుదల

మాస్ కమర్షియల్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ చిత్రం మీటర్ టీజర్ విడుదల

కిరణ్‌‌ అబ్బవరం హీరోగా రమేష్‌‌ కాదూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మీటర్’. మాస్ కమర్షియల్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌‌‌‌ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో పోలీస్‌‌ ఆఫీసర్‌‌‌‌గా నటిస్తున్నాడు కిరణ్. అతనికి జంటగా అతుల్య రవి నటిస్తోంది. శుక్రవారం తన ఫస్ట్ లుక్‌‌ను విడుదల చేశారు. బ్లూ డ్రెస్‌‌లో గ్లామరస్‌‌గా కనిపిస్తోందామె. ఐదేళ్ల క్రితం తమిళ చిత్రంతో హీరోయిన్‌‌గా పరిచయమైన అతుల్య.. అక్కడ పదికి పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో తనకిదే ఫస్ట్ సినిమా.  మైత్రీ మూవీ మేకర్స్‌‌ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 7న సినిమా విడుదల కానుంది.