Healty Food : మక్క రోటీ మంచి టేస్టీనే కాదు.. బలం కూడా

Healty Food : మక్క రోటీ మంచి టేస్టీనే కాదు.. బలం కూడా

నార్త్ ఇండియా ఫేమస్ మొక్కజొన్న రోటీ తిన్నారా! ఇప్పటివరకు లేదంటే కచ్చితంగా ఓసారి టేస్ట్ చేయాల్సిందే. ఈ వింటర్లో అయితే ప్రతిరోజూ తినాల్సిందే. దీని రుచి అలాంటిది మరి. అంతేనా బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ లాభాలతో పాటు, ఈ స్పెషల్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామా.. 

నార్త్ ఇండియా పాపులర్ ఫుడ్లలో నా మొక్కజొన్న రోటీలు ముందుంటాయి. ఈ హెల్దీ అండ్ టేస్టీ రోటీలకి ఆవ ఆకులు, పాలకూర, తోటకూర మొక్కజొన్న పిండితో చేసే సర్కోంకా సాగ్ కాంబినేషన్. మొదట్లో పరిమితమైన ఈ రెసిపీ ఇప్పుడు అందరి వంటింట్లో ఘుమ ఘుమలాడుతోంది. 

• మొక్కజొన్న పిండిలో కంటిచూపుని కాపాడే విటమిన్ ఫుడ్ - ఎ ఎక్కువ. ఇమ్యూనిటీని బూస్ట్ చేసే విటమిన్ సితో పాటు కె, బి-కాంప్లెక్స్ కూడా పుష్కలం. ఈ రోటీ తింటే శరీరానికి రోజువారి కావాల్సిన ఐరన్, ఫాస్పరస్, జింక్ అందుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ పిండిలో.

• మొక్కజొన్న పిండిలో పీచు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ రెగ్యులేట్ అవుతాయి. డైజెషన్ ట్రాక్ హెల్దీగా ఉంటుంది. 

• మార్కెట్లో దొరికే గోధుమ, మైదాలలో ఎక్కువగా గ్లూటెన్ ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు చర్మవ్యాధులు వస్తాయి. త్వరగా అలిసిపోతారు కూడా . వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే గ్లూటెన్ ఫ్రీ మొక్క జొన్న పిండిని డైట్లో చేర్చాల్సిందే. అలాగే లాక్టోజ్ లోపంతో బాధపడేవాళ్లు గ్లూటెన్ తో నిండిన ఫుడ్ తినకూడదు. అలాంటి వాళ్లకి బెస్ట్ సన్స్టిట్యూట్ మొక్కజొన్న పిండి. 

• మొక్కజొన్న పిండిలోని ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు చాలా మేలు చేస్తుంది. ఇది తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. 

• మొక్కజొన్న పిండిలోని థయమిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్ మెటబాలిజంని ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. 

• వీటిల్లోని మెగ్నీషియం, పొటాషియం ఎముకల డెన్సిటీని పెంచుతాయి. మొక్క జొన్న పిండిని రెగ్యులర్ డైట్ లో చేర్చితే గుండె జబ్బులు దరిచేరవు. బరువు పెరగాలనుకునే వాళ్లకి ఈ పిండి వంటల్ని మించిన బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు. 

• మొక్కజొన్న పిండిలో బీటా కెరోటిన్, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరుని మెరుగు పరుస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మొక్కజొన్న రోటీ వింటర్ చల్లదనం నుంచి రిలీఫ్ ఇస్తుంది. 

మొక్క జొన్న రోటీ.. 

కావాల్సినవి..

  • మొక్కజొన్న పిండి- రెండు కప్పులు
  • అల్లం- వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్ 
  • కొత్తిమీర - కొద్దిగా, 
  • కారం, ఉప్పు - తగినంత

తయారీ..

ఒక కప్పు నీళ్లలో అర టీ స్పూన్ ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు వేడెక్కాక స్టవ్ సిమ్ లో పెట్టి మొక్కజొన్న పిండి వేయాలి. ఆ మిశ్రమం అడుగు అంటకుండా, ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. ఆ పిండిని వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొత్తిమీర వేసి ముద్దలా చేయాలి. దాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో రోటీల్లా అదిమి పెనంపై కాల్చాలి. రోటి పొంగుతు న్నప్పుడు పైనుంచి నీళ్లు చల్లాలి. అలాగే మొక్క జొన్న రోటీని కాల్చేటప్పుడు పెద్ద మంట ఉండాలి.