మాలలకు న్యాయం చేయండి..కేంద్ర మంత్రికి మాల మహానాడు వినతి

మాలలకు న్యాయం చేయండి..కేంద్ర మంత్రికి మాల మహానాడు వినతి

హైదరాబాద్​ సిటీ, వెలుగు: తెలంగాణలోని మాలలతోపాటు 25 ఎస్సీ కులాలకు న్యాయం జరిగేలా చూడాలని  కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలేకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. 

ఈ మేరకు ఢిల్లీలోని మంత్రి ఇంట్లో కలిసి వినతి పత్రం సమర్పించారు.  కోర్టు ఇచ్చిన సూచనలకు విరుద్ధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎలాంటి ఎంపారికల్ డేటా తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణతో పాటు, ప్రభుత్వం చేసిన రోస్టర్ పాయింట్ల కేటాయింపులో నష్టపోతున్నామన్నారు. ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించిన గ్రూప్ 3 లోని 26 కులాలకు ఒక శాతం కంటే తక్కువ రిజర్వేషన్ అందేలా కుట్ర చేసి మాలలను రిజర్వేషన్లకు దూరం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి మాలలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.