ఎస్సీ వర్గీకరణ తీర్పుపై రిట్ దాఖలు చేస్తం : జి.చెన్నయ్య

ఎస్సీ వర్గీకరణ తీర్పుపై రిట్ దాఖలు చేస్తం :  జి.చెన్నయ్య

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడుర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు జి.చెన్నయ్య తెలిపారు. ఈ అంశంపై న్యాయపోరాటానికి సిద్ధమన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ చెన్నయ్య ఆధ్వర్యంలో మాలమహానాడు నేతలు రెండు రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. 

ఇందులో భాగంగా శుక్రవారం తెలంగాణ భవన్ లోని అంబేడ్కర్ విగ్రహం ముందు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. తర్వాత చెన్నయ్య మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతృత్వంలో ఆందోనలు ఉధృతం చేస్తామని చెప్పారు. ఇది సుప్రీంకోర్టు చేసిన వర్గీకరణ కాదని.. మోడీ చేసిన వర్గీకరణ అని దుయ్యబట్టారు. వర్గీకరణ చేయడమంటే దళితులను విడదీసే కుట్రే అన్నారు. మాలకు అన్యాయం చేసేలా వ్యవహరించిన బీజేపీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.