
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాక అందించిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. కావా వెంకటస్వామి 96 జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఆకాంక్షను ఢిల్లీలో సోనియాగాంధీకి చెప్పి రాష్ట్ర ఏర్పాటు కృషి చేసిన ఘనత కాక వెంకటస్వామిది అని అన్నారు.
అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టుకొని ఢిల్లీ వెళ్లి.. తెలంగాణ స్వరాన్ని వినిపించిన ఏకైక తెలంగాణ నాయకుడు కాకా వెంకట స్వామి అని అన్నారు. తెలంగాణ వచ్చాకే తన ప్రాణం పోతుందని గట్టిగా పోరాటం చేసిన గొప్ప నేత కాకా అని.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పరమపదించిన గొప్ప నాయకుడు కాకా అని కొనియాడారు.
సమాజంలోని బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి గడ్డం వెంకటస్వామి అని ఈ సందర్భంగా చెన్నయ్య అన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచిన వెంకటస్వామిని కాకాగా పెంచుకుంటారని చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో ఇల్లు లేని ఎంతో మంది నిరుపేదలకు గుడిసెలు వేయించి ఆసరాగా నిలిచినందుకు గాను గుడిసెల వెంకటస్వామిగా పిలుచుకుంటారని గుర్తుచేశారు. సమాజంలోని పేద ప్రజల పక్షాన నిలబడి వారి అభివృద్ధికి పాటుపడిన మహా నాయకుడు కాకా అని కొనియాడారు చెన్నయ్య.