
- జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య
ఖైరతాబాద్,వెలుగు : దేశంలో దళితులు, ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య పేర్కొన్నారు. మాల ప్రజా సంఘాల జేఏసీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో మాల ప్రజా సంఘాలు, మాల మహానాడు కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. మాలల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో దళితులను కేసీఆర్ పథకాలపేరుతో మాయ చేశారని విమర్శించారు. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నుంచి ఇచ్చిన మాట ప్రకారం పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయన్నారు. ఈ సమావేశంలో మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేష్, మన్నె శ్రీధర్‌రావు ,బైండ్ల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.