అశాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ.. జీవో 99ను వెంటనే రద్దు చేయాలి: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్కు మాల సంఘాల జేఏసీ వినతి

అశాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ.. జీవో 99ను వెంటనే రద్దు చేయాలి: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్కు  మాల సంఘాల జేఏసీ వినతి

ముషీరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు గైడ్​లైన్స్​కు వ్యతిరేకంగా జనాభా లెక్కలు సేకరించకుండా అశాస్త్రీయంగా జరిగిన ఎస్సీ వర్గీకరణను జీవో 99ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ డిమాండ్​చేసింది. మంగళవారం (సెప్టెంబర్ 03) హైదరాబాద్ లోని తన కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, బేర బాలకిషన్, చెరుకు రామచందర్ కలిశారు.

 ఎస్సీ వర్గీకరణ వల్ల మాల, మాల ఉప కులాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై వివరించి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల మాల ప్రజానీకం ఆందోళనలో ఉందని, దీనిని సవరించి న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు.