బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలియా భట్

బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలియా భట్

హైదరాబాద్​, వెలుగు: నగలు అమ్మే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌‌‌‌‌‌‌‌ తమ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాలీవుడ్ నటి అలియా భట్‌‌‌‌‌‌‌‌ను నియమించుకుంది. 30 వ  వార్షికోత్సవాన్ని  జరుపుకుంటున్న సందర్భంగా అలియాతో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 312 షోరూమ్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. ‘మలబార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి గ్లోబల్‌‌‌‌‌‌‌‌ బ్రాండ్‌‌‌‌‌‌‌‌కు  అంబాసిడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. కంపెనీకి ఇండియాతో పాటు  విదేశాల్లోనూ ఉన్న పాపులారిటీ చూసిన తర్వాత బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారడం గర్వంగా అనిపిస్తోంది’ అని అలియా పేర్కొన్నారు. 4.1 బిలియన్ డాలర్ల టర్నోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  గ్లోబల్‌‌‌‌గా ఆరో అతిపెద్ద నగల రిటైలర్‌‌‌‌‌‌‌‌గా స్థానం దక్కించుకున్నామని  మలబార్ పేర్కొంది.