బాలీవుడ్ హాట్ బ్యూటీ, ఫిట్‌నెస్ క్వీన్ మలైకా ఆరోరా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. నటుడు అర్జున్ కపూర్‌తో బ్రేకప్ అయిన తర్వాత కొద్ది నెలలకే, ఆమె ఒక కొత్త 'మిస్టరీ మ్యాన్'తో కలిసి కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ వరుస దృశ్యాలు ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాయా అనే ఊహాగానాలకు తెరలేపాయి.
కొత్త "మిస్టరీ మ్యాన్"...
ఈ రూమర్లన్నీ అక్టోబర్ 29న ముంబైలో జరిగిన ఎన్రిక్ ఇగ్లేసియస్ కచేరీలో మొదలయ్యాయి. ఒక 33 ఏళ్ల యువకునితో మలైకా కనిపించడం, ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ, వేదిక నుంచి బయటకు వెళ్లడం కెమెరాలకు చిక్కింది. ఆ తర్వాత సరిగ్గా నెల రోజులకే, అంటే నవంబర్ 26న, అదే వ్యక్తితో ఆమె ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమయ్యారు. వీరిద్దరూ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ నుంచి కొంత దూరం పాటించి నడిచినా, చివరకు ఒకే కారులో ఎక్కి వెళ్లడం నెటిజన్ల కళ్ళకు చిక్కింది. ఈ రెండు సందర్భాలు వారి మధ్య ఏదో ఉందని బలమైన సంకేతాలను ఇచ్చాయి.
33 ఏళ్ల హర్ష్ మెహతా ఎవరు?
నెటిజన్లు, మీడియా ఈ "మిస్టరీ మ్యాన్" గురించి తీవ్రంగా అన్వేషిస్తున్నారు. పలు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, ఆ యువకుడు హర్ష్ మెహతా అనే 33 ఏళ్ల డైమండ్ వ్యాపారి అని తెలుస్తోంది. అయితే అతను మలైకా ఆరోరా మేనేజర్ కావచ్చు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే వయస్సులో వారిద్దరి మధ్య దాదాపు 19 ఏళ్ల తేడా ఉండటం ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. మలైకాకు ప్రస్తుతం 52 ఏళ్లు. దీంతో ఆమె వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో , సినీ వర్గాల్లో ఎప్పుడూ చర్చనీయాంశమే.
మలైకా డేటింగ్..?
మలైకా ఆరోరా మొదట 1998లో నటుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. 2017లో విడాకులు తీసుకున్నారు. వారికి అర్దాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు, అతనితో కలిసి కో-పేరెంటింగ్ చేస్తున్నారు. విడాకుల తర్వాత ఆమె నటుడు అర్జున్ కపూర్‌తో సుదీర్ఘకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వారి మధ్య వయస్సు వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఈ రిలేషన్‌షిప్‌పై ఆమె ఎప్పుడూ ధైర్యంగా ఉన్నారు.
ప్రస్తుతం, హర్ష్ మెహతాతో ఆమెకున్న సంబంధంపై వస్తున్న డేటింగ్ వార్తలపై మలైకా గానీ, హర్ష్ మెహతా గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, వరుసగా రెండు పెద్ద పబ్లిక్ ఈవెంట్లలో ఒకే వ్యక్తితో కలిసి కనిపించడం, కలిసి ఒకే కారులో వెళ్లడం చూస్తుంటే, వారిద్దరి మధ్య పరిచయం కేవలం వృత్తిపరమైనదా లేక వ్యక్తిగతమా అనే అంశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మలైకా ఆరోరా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారా? ఈ 33 ఏళ్ల యువకుడితో ఆమె డేటింగ్‌లో ఉన్నారనే రూమర్‌పై స్పష్టత రావాలంటే, ఆమె నోరు విప్పే వరకు వేచి చూడక తప్పదు.
