Malavika Mohanan: "ప్రభాస్ లాంటి స్టార్ ఒకే ఒక్కడు".. 'రాజాసాబ్'పై మాళవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Malavika Mohanan: "ప్రభాస్ లాంటి స్టార్ ఒకే ఒక్కడు".. 'రాజాసాబ్'పై మాళవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మళయాల కుట్టి మాళవిక మోహనన్ తెలుగులో ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ అనే చెప్పాలి. తొలిసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఇందులో మాళవిక మోహనన్, రెడ్డి కుమార్, నిధి అగ ర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే హైప్ క్రియేట్ అయ్యింది.

లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిందీ అమ్మడు. “నేను ప్రభాస్. కార్తి వంటి స్టార్స్ తో సినిమాలు చేస్తున్నా. అందులో తెలుగు సూపర్ స్టార్ ప్రభాస్ తో ' ది. రాజాసాబ్' మూవీ చేశా. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇందులోనా పాత్ర చాలా బాగుంటది. స్టార్ హీరో సినిమాల్లో హీరోయిన్లకు చాలా ప్రాధాన్యత తక్కువ.  ఐదారు సీన్స్, ఒక పాట మాత్రమే ఉంటుంది. ఒకవేళ రెండు పాటలు ఉంటే మాత్రం ఎంతో అదృష్టం ఉంటే కానీ అలా జరగదు. 

ప్రభాస్ లాంటి స్టార్ ఒకే ఒక్కడుంటాడు. 'రాజాసాబ్' కూడా నాకు ఐదారు సీన్స్, ఓ పాట ఉంటుందని అనుకున్నా కానీ ఇందులో నాకు గొప్ప పాత్ర దొరికింది.సినిమా అంటే ప్రతి ఒక్కరి కీ ఒక ఫైనల్ లాంటింది. మనకు పెద్ద బడ్జెట్, స్టార్ హీరో, డైరెక్టర్ చిత్రాల్లో చాన్స్ దొరకాలంటే చాలా కష్టపడాలి. ప్రతిదీ మన జీవితంలో ఒక పజిల్ లాంటిదే" అంటోందీ అమ్మడు.  తెలుగులో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.  ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలింది.  'రాజాసాబ్' నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్స్ అంచనాలు మరింత రెట్టింపు చేశారు. వచ్చే ఏడాది జనవరి9న ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.