Malavika Mohanan: ప్రకృతి ఒడిలో 'ది రాజాసాబ్' బ్యూటీ.. జవాయి కొండల్లో చిరుతపులుల వేట!

Malavika Mohanan:  ప్రకృతి ఒడిలో 'ది రాజాసాబ్' బ్యూటీ..  జవాయి కొండల్లో చిరుతపులుల వేట!

భాషతో సంబంధం లేకుండా డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న అందాల తార మాళవిక మోహనన్. ఇటీవలే ప్రభాస్ తో కలిసి 'ది రాజాసాబ్' తో అలరించింది.  త్వరలో 'సర్దార్ 2'తో సందడి చేయడానికి ఈ భామ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉందీ ముద్దుగుమ్మ. షూటింగ్స్ నుంచి కాస్త టైం దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా షికారుకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది..

లేటెస్ట్ గా ఈ బ్యూటీ రాజస్థాన్ లోని జవాయి ప్రాంతంలో మూడు రోజులపాటు చుట్టేసింది. అక్కడ గడిపిన మ్యాజిక్ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'పురాతన గ్రానైట్ కొండల మధ్య చిరుతల కోసం వెతుకుతూ సాగిన ఈ అపూర్వ ప్రయాణం నన్ను ఎంతో ఇంప్రెస్ చేసిందంటూ చెప్పుకొచ్చింది. అడవి నిశ్శబ్దం, ప్రకృతి సౌందర్యం, అద్భుతమైన ఆప్టికల్ నైపుణ్యం మధ్య గడిచిన అరుదైన క్షణాలు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని తెలిపింది. వన్యప్రాణుల తన కెమెరాలో బందిస్తూ తీసిన పోటోలను అభిమానులతో పంచుకుంది.

 తెల్లవారుజామునే ప్రారంభమైన తమ ప్రయాణాలు, గంటల కొద్దీ ఎదురుచూపులు, క్షణాల్లో మాయమైపోయే చిరుతల దృశ్యాలు కమనీయం అని మాళవిక వర్ణించింది.. ఈ ప్రయాణం కేవలం వన్యప్రాణులను చూడటానికే కాకుండా, మనం ప్రకృతిలో ఎంత చిన్నవాళ్లమో గుర్తుచేసే ఆత్మీయ అనుభూతిని కూడా అందించింది. నిజంగా చూడటం అంటే ఏమిటో, ఆ క్షణాన్ని మనసారా ఆస్వాదించా అంటూ సంతోషం వ్యక్తం చేసింది. హృదయాన్ని తాకే, వినయాన్ని నేర్పిన ఈ జర్నీని ఎప్పటికీ మరచి పోను అంటూ మాళవిక పోస్ట్ చేసింది. ప్రస్తుతం  సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.