MalavikaMohanan: హలో గ్రీస్.. రెబల్ లేడీ మేనియా ఇది.. రాజాసాబ్ బ్యూటీ స్టన్నింగ్ పోజ్ వైరల్

MalavikaMohanan: హలో గ్రీస్.. రెబల్ లేడీ మేనియా ఇది.. రాజాసాబ్ బ్యూటీ స్టన్నింగ్ పోజ్ వైరల్

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది మాళవిక మోహనన్. ప్రస్తుతం ఈ బ్యూటీ రాజాసాబ్తో పాటుగా కార్తికి జంటగా ‘సర్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’లో నటిస్తుంది. వీటితో పాటు ముచ్చటగా మరో మూడు చిత్రాలు రాబోతున్నాయి.  

‘రాజా సాబ్’ విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘రాజా సాబ్’ షూటింగ్‌లో మాళవిక బిజీగా ఉంది. ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఆమె సెట్‌లో ఉన్న ఫొటోను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో ‘రాజా సాబ్’ స్టిక్కర్‌‌తో ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన డెనిమ్ జాకెట్ వేసుకుని నదీ తీరాన కూర్చొని ఉన్న ఆమె స్టిల్ ఆకట్టుకుంది. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన టీమ్.. ‘రెబల్ మేనియా’ అంటూ పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ యూరప్‌లోని అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. అక్కడ రెండు పాటలు చిత్రీకరించనున్నారు. అతి త్వరలోనే రాజాసాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.

ఇప్పటికే, పాటకు సంబంధించి కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ డ్యాన్స్ చేసే లెగ్ మూమెంట్స్తో ఉన్న ఫోటో ఒకటి ఫ్యాన్స్ని తెగ ఆకట్టుకుంటోంది. మరి సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలి!!

మారుతి రూపొందిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బోమన్‌ ఇరానీ  కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా మూవీ రిలీజ్ కానుంది.