Vincy Aloshious: ద‌స‌రా విల‌న్‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు.. ఫిల్మ్ ఛాంబర్లో నటి ఫిర్యాదు

Vincy Aloshious: ద‌స‌రా విల‌న్‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు.. ఫిల్మ్ ఛాంబర్లో నటి ఫిర్యాదు

మలయాళ నటి విన్సీ అలోషియస్ (Vincy Aloshious) తన సహనటుడు షైన్ టామ్ చాకోపై కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేసింది.

తన సహనటుడు సెట్‌లో డ్రగ్స్ వాడుతున్నాడని మరియు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని రెండ్రోజుల క్రితమే ఓ వీడియో రిలీజ్ చేసి వివరాలు వెల్లడించింది. కానీ, ఆ వీడియోలో నటుడి పేరు లేదా సినిమా పేరు చెప్పకుండానే ముగించింది. 

ఇప్పుడు, ఆమె నటుడి పేరు చెబుతూ కేరళ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు మలయాళ చిత్ర పరిశ్రమ అంతర్గత ఫిర్యాదు కమిటీకి  ఫిర్యాదు చేసింది. ఆయన 'సుత్రవాక్యం' సినిమా సెట్‌లో మద్యం మత్తులో ఉన్నప్పుడు తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించింది.

కొన్ని రోజుల క్రితం, కేరళలోని పల్లిపురం చర్చిలో జరిగిన KCYM మీటింగ్ లో విన్సీ మాటలాడుతూ.."డ్రగ్స్ తీసుకున్న ఏ ఆర్టిస్ట్ తోనూ కలిసి పని చేయనని" ప్రకటించింది. 'రేఖ', 'వికృతి', 'జన గణ మన' వంటి చిత్రాలలో తన పాత్రలకు విన్సీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. 

ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో మాట్లాడుతూ .. 'ఓ సినిమా షూటింగ్‌ సమయంలో ఆ హీరో డ్రగ్స్‌ తీసుకున్నాడు. నాతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ షూటింగ్‌ జరిగినన్ని రోజులు ఎంతో ఇబ్బందిపడ్డా. తన ముందే దుస్తులు మార్చుకోమని ఇబ్బందిపెట్టాడు. అందరి ముందే ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. నా జీవితంలో ఇది ఒక అసహ్యకరమైన సంఘటన' అని చెప్పుకొచ్చింది.

సినిమా ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను పలువురు నటీమణులు పలు సందర్భాల్లో ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తనకు కూడా సెట్ లో అలాంటి దురదృష్టకర పరిస్థితి ఎదురైందని నటి విన్సీ అలోషియస్ ముందుకు రావడంతో ఆమెకు ఇనుఁడస్ట్రీ నుంచి మద్దతు లభిస్తుంది. 

షైన్ టామ్ చాకో(Shine Tom Chacko):

దసరా (Dasara) సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో(Shine Tom Chacko). 2015లో అతనిపై నమోదైన డ్రగ్స్ కేసు నుంచి ఇటీవలే నిర్దోషిగా చాకో బయటపడ్డాడు. NDPS చట్టం, 1985 ప్రకారం కొకైన్ కేసులో 2015లో చాకోపై కేసు నమోదైంది. సరైన ఆధారాలను ప్రొడ్యూస్ చేయలేకపోవడంతో చాకోతో పాటు మరో ఆరుగురుని నిర్దోషులుగా కొచ్చిలోని అడిషనల్ సెషన్స్ కోర్టు ప్రకటించింది. ఇటీవలే ఎన్టీఆర్ దేవర సినిమాలో చాకో ఓ కీలక పాత్రలో నటించాడు.