Balram Mattannur: ప్రముఖ సినీ రచయిత బలరామ్ కన్నుమూత 

Balram Mattannur: ప్రముఖ సినీ రచయిత బలరామ్ కన్నుమూత 

సినీ ఇండస్ట్రీని వరుస మరణాలు వెంటాడుతున్నాయి. తెలుగు, తమిళ, బాలీవుడ్ అనే భాషతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. తాజాగా ప్రముఖ మలయాళ స్క్రీన్ రైటర్ మరియు కథా రచయిత బలరామ్ మట్టనూర్(Balram Mattannur) కన్నుమూశారు.ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతూ చికిత్స పొందుతున్నారు.

ఈ రోజు (ఏప్రిల్ 18న) మధ్యాహ్నం 2 గంటలకు కన్నూర్ పుల్లూపి కమ్యూనిటీ శ్మశాన వాటికలో బలరామ్ అంత్యక్రియలు జరిగాయి.ఆయనకు భార్య కెఎన్ సౌమ్య , కుమార్తె గాయత్రి ఉన్నారు.బలరామ్ మృతి పట్ల సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు, ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. 

జయరాజ్ దర్శకత్వం వహించి, 1997లో విడుదలైన కాళియాట్టం, బలరామ్ మట్టన్నూర్ అందించిన స్క్రిప్ట్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా. అంతేకాక బలరామ్ కర్మయోగి, సమవాక్యం, అన్య లోకం, ఫాదర్ అండ్ సన్, హోలీ స్పిరిట్ మరియు అక్వేరియం వంటి సినిమాలకు స్క్రిప్ట్ అందించాడు.

బలరాం చలనచిత్ర రంగానికి తన రచనలతో పాటుగా..'ముయల్ గ్రామం,' 'రవి భగవాన్,' మరియు 'బాలన్' వంటి ప్రముఖ పుస్తకాలను కూడా రాశారు. అతని సాహిత్య రచనలు పూర్తిగా మానవ భావోద్వేగాలు మరియు సంబంధాలపై లోతైన అంతర్దృష్టిని కలిగించాయి.