కౌలాలంపూర్: ఇండియా స్టార్ షట్లర్ లక్ష్యసేన్.. మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీలో బోణీ చేశాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్య 21–16, 15–21, 21–14తో జియా హెంగ్ జాసన్ టెహ్ (సింగపూర్)పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో ఆయుష్ షెట్టి 21–12, 21–17తో లీ జి జియా (మలేసియా)కు షాకిచ్చాడు. విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో మాళవిక బన్సోద్ 11–21, 11–21తో రచనోక్ ఇంతనోన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. మెన్స్ డబుల్స్‌లో అర్జున్–హరిహరన్ 10–21, 20–22తో హిరోకి మిడోరికవా–కోహి యమషితా (జపాన్) చేతిలో కంగుతిన్నారు.
