రష్యన్ బ్యూటీకి మలేసియా మాజీ రాజు ట్రిపుల్ తలాక్

రష్యన్ బ్యూటీకి మలేసియా మాజీ రాజు ట్రిపుల్ తలాక్

కౌలాలంపూర్:  మలేసియా మాజీ రాజు సుల్తాన్ మహ్మద్ రష్యన్ మాజీ బ్యూటీక్వీన్ కు విడాకులిచ్చారు. రాజు పదవిని వదులుకున్న తొలి వ్యక్తిగా జనవరిలో ఆయన వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పెళ్లయిన నెలలోనే మాజీ మిస్ మాస్కో రిహానా అక్సానా గొర్బటెంకోకు ఆయన డైవోర్స్ ఇచ్చారు. షరియత్ చట్టం ప్రకారం గత నెల 22న ట్రిపుల్ తలాక్​ చెప్పినట్లు ఆయన తరఫున లాయర్ ప్రకటించారు మలేసియాలోని కెలంటన్ స్టేట్ లోని ఇస్లామిక్ కోర్టు డైవోర్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చినట్లు చెప్పారు. ఈ వార్తలను రిహానా తిరస్కరించింది. తాను డైవోర్స్ స్టేట్ మెంట్ వినలేదని,  తనకు నేరుగా చెప్పలేదని, సుల్తాన్ మహ్మద్ తో తన బంధం కొనసాగుతుందన్నారు. భర్త, కొడుకుతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు.