ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి అనుచిత పోస్ట్..భగ్గుమంటున్న నెటిజన్లు

ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి అనుచిత పోస్ట్..భగ్గుమంటున్న నెటిజన్లు

ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి మరియం షియువా చేసిన వివాదాస్పద ట్వీట్ పై వివాదం కొనసాగుతోంది. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాల్దీవుల మంత్రి చేసిన ట్వీట్ పై భారత నెటిజన్లు మండిపడుతున్నారు. మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. టూర్ లను రద్దు చేసుకున్న టికెట్ క్లిప్ లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 

మాల్దీవుల్లో ప్రధాని మోదీ ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా మోదీ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ మాల్దీవుల యూత్ ఎంపవర్ మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియువా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని ఇజ్రాయెల్ తోలు బొమమ్మ అని చెపుతూXలో పోస్ట్ చేశారు. 

భారత పర్యాటకాన్ని హేళన చేస్తూ మాల్దీవుల మంత్రుతు హేళనగా పోస్ట్ చేశారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి మరియం సియువా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలకు దారి తీయడంతో ట్విట్టర్లో పోస్టులను తొలగించారు. 

మంత్రిని తోటి మాల్దీవులు తిట్టారు 

ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి మరియం సియువా చేసిన వ్యాఖ్యలపై పలువురు మాల్దీవుల పౌరులు తీవ్రంగా  మండిపడ్డారు. ఈ పోస్టులకు ఇంత చిన్న పిల్లలా ప్రత్యుత్తరం ఇవ్వడాన్ని దిగజారుడు తనం.. ఇది దేశానికి ఎంత అవమాన కలిగిస్తుందన్నారు. మీ చర్యలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. మాల్దీవుల సాధారణ ప్రజలను పట్టించుకోవడం లేదు.. మీరు మాల్దీవుల ప్రజలను పట్టించుకుని ఉండే ఇంత అవమాన కరంగా ప్రవర్తించి ఉండేవారు కాదని విమర్శించారు.