చిన్నారులపై కేర్ టేకర్ వేధింపులు: 690 ఏళ్లు జైలు శిక్ష

చిన్నారులపై కేర్ టేకర్ వేధింపులు: 690 ఏళ్లు జైలు శిక్ష

మహిళలకు అన్యాయం జరిగితే గగ్గోలు పెట్టే సమాజం పురుషులకు అన్యాయం జరిగితే లైట్ తీసుకొంటుంది. ఎక్కడైనా అమ్మాయిలను ఏడిపిస్తూ పోలీసుల చేతికి చిక్కితే చాలు బడిత పూజ చేస్తారు.  ఇక అంతే కాదు వేధింపుల కేసు పెట్టి జైలుకు పంపిస్తారు.  అయితే తాజాగా యూఎస్ లో (US) ఇప్పుడు ఓ వార్త వెలుగు చూసింది.  వేధింపుల కేసులో ఓ వ్యక్తికి ఏకంగా 690 ఏళ్లు జైలు శిక్ష విధించింది.  అయితే అయన అమ్మాయిలను వేధించలేదు.  16 మంది అబ్బాయిలను వేధించినట్లు  నేరం రుజువైంది.  న్యాయమూర్తి  ఇతడు కేర్ టేకర్ కాదు.. కేర్ రాక్షసుడు అని వర్ణించాడు.

వివరాల్లోకి వెళ్తే ...

దక్షిణ కాలిఫోర్నియాలో చాల మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని చూసుకునేందుకు మాథ్యూ జక్ర్‌జెవ్‌స్కీ అనే వ్యక్తిని ఆయాగా నియమించుకున్నారు. తమ పిల్లను ఓ సంరక్షకుని నీడలో పెంచుతున్నాం అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ ఓ రాక్షసుడి చేతిలో పిల్లలని పెడుతున్నాం అని తెలుసుకోలేక పోయారు. తల్లిదండ్రులు అతన్ని విశ్వసించారు. ఇదే అదునుగా అతను మైనర్ అబ్బాయిలని వేధించడం ప్రారంభించారు 16 సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ వయసున్న అబ్బాయిలకి అస్లీల వీడియోలు చూపించడం.. వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం చేశారు. పిల్లలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పగా.. తల్లిదండ్రులు అతని పైన కేసుపెట్టారు. ఈ కేసులో ఆ ఆయాని నిందితుడుగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అతనికి 690 ఏళ్ల యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. కాగా మొత్తం 34 కేసుల్లో అతను నిందితుడుగా ఉన్నాడు.

అమాయక పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన మగ ఆయాను  కోర్టు దోషిగా నిర్ధారించింది. రెండు నుంచి పన్నెండేళ్ల మధ్య వయసున్న 16 మంది చిన్నారులపై సామూహిక హత్యాకాండ జరిపినట్టు నిర్దారించారు.  బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దక్షిణ కాలిఫోర్నియాలోని ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. నిందితుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆరా తీయగా పోలీసులకు షాకింగ్ సమాచారం అందింది.   కాలిఫోర్నియాలోని కోస్టా మెసాకు చెందిన మాథ్యూ ఆంటోనియో జక్ర్జెవ్స్కీ ( 34)ని నిందితుడిగా గుర్తించి...మే 17, 2019న అంతర్జాతీయ పర్యటన సందర్భంగా విమానం దిగిన తర్వాత విమానాశ్రయంలో అరెస్టు చేశారు.చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడిని కోర్టు దోషిగా నిర్ధారిం...  690 ఏళ్ల జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.