హైదరాబాద్, వెలుగు:రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్సీపీఎల్) తన మాలిబన్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ సరికొత్త మాలిబన్ టీ టైమ్ బటర్ కుకీని మార్కెట్లోకి విడుదల చేసింది. భారతీయుల చాయ్ అలవాటును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూ.ఐదు ధరలో ఈ బిస్కెట్లను ప్రవేశపెట్టారు.
ఇతర బటర్ బిస్కెట్లతో పోలిస్తే ఇందులో 10 రెట్లు ఎక్కువ బటర్ ఉపయోగించినట్లు కంపెనీ వెల్లడించింది. చాయ్‌లో బిస్కెట్లను ముంచి తినడానికి ఇష్టపడే వినియోగదారుల కోసం దీనిని ప్రత్యేకమైన అంతర్జాతీయ డిజైన్ తో తయారు చేశామని కంపెనీ పేర్కొంది. ఫ్యామిలీ ప్యాక్ కూడా అందుబాటులో ఉందని పేర్కొంది.
