గూగుల్ పేలో లంచం..ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్

గూగుల్ పేలో లంచం..ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్

డబ్బులు ఇస్తే ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిస్తానని చెప్పి రూ.34 వేలు లంచం తీసుకున్న మల్కాజిగిరి జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వివరాలు వెల్లడించారు. సర్కిల్​ పరిధిలోని మిర్జాలగూడలో ఓ మహిళ తన ఇంటిపై మరో ఫ్లోర్ నిర్మిస్తోంది. దానికి ప్రాపర్టీ ట్యాక్స్ పెద్దమొత్తంలో చెల్లించాలని మల్కాజిగిరి జీహెచ్ఎంసీ బిల్ కలెకర్ట్ సయ్యద్ యాకుబ్ అల్తాఫ్ ఆమెను భయపెట్టాడు. డబ్బులు ఇస్తే ట్యాక్స్ కొంత తగ్గిస్తానని చెప్పాడు. దీంతో ఆ మహిళ అల్తాఫ్​ కు మొదట రూ.25వేలు ఇచ్చింది. రూ.14 వేలు ఇవ్వాలని అల్తాఫ్ ఆమెకు ఫోన్ చేశాడు. దీంతో ఆ మహిళ గూగుల్ పే చేస్తానని చెప్పింది. ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. శనివారం  అల్తాఫ్​కు గూగుల్​ పే ద్వారా రూ.14 వేలు ట్రాన్స్​ఫర్​చేసింది.  రాం నగర్​లోని అల్తాఫ్​ ఇంటి వద్ద సిద్ధంగా ఉన్న ఏసీబీ అధికారులు అమౌంట్ ట్రాన్స్ ఫర్ అవగానే అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.