మెదక్ కు పట్టిన శని మంత్రి హరీశ్​రావు : మైనంపల్లి హన్మంత రావు​

మెదక్ కు పట్టిన శని మంత్రి హరీశ్​రావు : మైనంపల్లి హన్మంత రావు​

మెదక్, వెలుగు: మెదక్ జిల్లాకు పట్టిన శని మంత్రి హరీశ్​ రావు అని.. ఆ శని వదిలించడమే తమ లక్ష్యమని మల్కాజ్​ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు​ అన్నారు. శనివారం పట్టణ కాంగ్రెస్​ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. హరీశ్ రావు​ పొద్దున లేస్తే మెదక్​ మీద పడుతున్నడు.. ఆయనకు మెదక్​తో ఏం పనని ప్రశ్నించారు. తాము మెదక్ జిల్లా ఏర్పాటు చేశామని గొప్పలు చెబుతున్నారని కానీ బ్రిటీష్​ కాలంలోనే మెదక్​ జిల్లా ఏర్పడిందన్నారు.

మెదక్‌లో ఉన్న అనేక ఆఫీస్​లను సిద్దిపేటకు తరలించారని మండిపడ్డారు. మెదక్ పట్టణానికి కనీసం బైపాస్​ రోడ్డు నిర్మించలేదని విమర్శించారు. మైనంపల్లి రోహిత్​ మాట్లాడుతూ ఏ పదవులు లేకున్నా స్వచ్ఛందంగా సొంత డబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానన్నారు. డబ్బు సంపాదన కోసం కాకుండా మెదక్​ సమగ్ర అభివృద్ధి కోసమే తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్​ సుప్రభాత్ రావు, ఆంజనేయులు, సురేందర్​, ప్రభాకర్​, రాంచందర్​, రాజిరెడ్డి, పండరి, జీవన్​ రావు,  హఫీజ్​, రమేశ్​, శ్రీనివాస్​, అమీరొద్దీన్​, అలీ బేగ్​ పాల్గొన్నారు.