మల్కాజిగిరి, వెలుగు : మల్కాజిగిరి పరిధిలోని న్యూ సాయినాథ్పురం భరత్ నగర్ కాలనీతోపాటు మౌలాలీ సర్కిల్ 04లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రెండు భవనాలను శుక్రవారం సీజ్ చేశారు. అనుమతికి మించి అదనపు నిర్మాణాలు చేపట్టడంతో గ్రౌండ్ ఫ్లోర్, మూడో అంతస్తులను గుర్తించి సీజ్ చేసినట్లు టౌన్ ప్లానింగ్ అధికారి బాల శ్రీనివాస్ తెలిపారు.
పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ సంబంధిత యజమానులు స్పందించకపోవడంతో ఈ చర్యలు
తీసుకున్నామన్నారు.
